మేము టీఆర్ఎస్ లోకి వచ్చినందుకు హరీశ్ అలిగి అన్నం తినకుండా పడుకున్నారు!: కొండా మురళి
Advertisement
తమను పార్టీలోకి తీసుకోవడం ఇష్టం లేని హరీశ్ రావు కేసీఆర్ పై అలిగి భోజనం చేయకుండా పడుకున్నారని టీఆర్ఎస్ నేత కొండా మురళి తెలిపారు. తెలంగాణకు కేంద్ర నేతలు ఎవరు వచ్చినా తమ ఫోన్లను ట్యాప్ చేయడం పరిపాటిగా మారిపోయిందని వెల్లడించారు. రాష్ట్రానికి కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ, బీజేపీ చీఫ్ అమిత్ షా సహా ఎవరు వచ్చినా తనతో పాటు తన డ్రైవర్ ఫోన్ ను ప్రభుత్వం ట్యాపింగ్ చేస్తోందని ఆరోపించారు. సోమాజీగూడలో ఈ రోజు జరిగిన మీడియా సమావేశంలో భార్య సురేఖతో కలసి కొండా మురళీ మాట్లాడారు.

అంతర్గతంగా చేసిన సర్వేలో సురేఖకు 69 శాతం సానుకూలంగా ఉన్నట్లు వెల్లడయిందన్నారు. అయినప్పటికీ ఆమెకు టికెట్ ఇవ్వకుండా 33 శాతం సానుకూలత ఉన్నవారిని పార్టీ అభ్యర్థులుగా ప్రకటించారని మురళీ మండిపడ్డారు. ఇప్పుడు ప్రకటించిన 105 మందికి కేసీఆర్ అసలు బీఫామ్ ఇస్తారా? అని మురళీ ప్రశ్నించారు.
Sat, Sep 08, 2018, 12:28 PM
Copyright © 2018; www.ap7am.com
Privacy Policy | Desktop View