జమ్ము కశ్మీర్‌ డీజీపీపై బదిలీ వేటు.. ఇన్‌చార్జిగా దిల్బాగ్‌సింగ్‌!
Advertisement
కిడ్నాపైన పోలీసు అధికారులు, వారి కుటుంబ సభ్యులను రక్షించేందుకు ఉగ్రవాదులను విడుదల చేసి జమ్ము కశ్మీర్‌ డీజీపీ ఎస్‌.పి.వేద్‌ భారీమూల్యమే చెల్లించుకున్నారని పరిశీలకులు భావిస్తున్నారు. ఉన్నతాధికారుల బదిలీల్లో భాగంగా ప్రభుత్వం ఆయనను పదవి నుంచి తప్పించింది. ఉగ్రవాదుల విడుదల నేపథ్యంలో కేంద్రంతో ఏర్పడిన విభేదాల పర్యవసానమే ఆయనపై వేటు అన్న అభిప్రాయం వినిపిస్తోంది. గత వారం దక్షిణ కశ్మీర్‌లో ముగ్గురు పోలీసు అధికారులు, ఎనిమిది మంది వారి బంధువులను ఉగ్రవాదులు అపహరించారు. పోలీసుల అదుపులో ఉన్న ఉగ్రవాదులను విడిచిపెట్టాలని డిమాండ్‌ పెట్టారు.

దీంతో హిజ్బుల్‌ ముజాహిదీన్‌ కమాండర్‌ రివైజ్‌ నైకూ తండ్రి సహా మొత్తం 12 మందిని పోలీసులు వదిలేశారు. ఈ చర్యతో కేంద్ర హోంశాఖ విభేదించిన పర్యవసానమే వేద్‌పై వేటు అన్న మాట వినిపిస్తోంది. వేద్‌ స్థానంలో జైళ్ల శాఖ డీజీ దిల్బాగ్‌ సింగ్‌కు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. అలాగే కీలకమైన ఇంటెలిజెన్స్‌ విభాగం చీఫ్‌ అబ్దుల్‌ గనీమిర్‌ను కూడా బదిలీ చేశారు.
Sat, Sep 08, 2018, 12:01 PM
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View