అల్లర్లను అదుపు చేసేందుకు రూటుమార్చిన జమ్ము కశ్మీర్‌ పోలీసులు!
Advertisement
‘ముల్లును ముల్లుతోనే తీయాలి’ అన్నారు పెద్దలు. భద్రతా బలగాలపై రాళ్లు విసురుతున్న అల్లరి మూకలను అదుపులోకి తీసుకునేందుకు జమ్ము కశ్మీర్‌ పోలీసులు సరిగ్గా ఈ సూత్రాన్నే అనుసరించారు. ఆందోళనకారులతో కలిసిపోయి తామూ రాళ్లు విసురుతున్నట్లు నటిస్తూ అసలు నిందితులను ఒడిసిపట్టుకున్నారు. జామా మసీదు వద్ద శుక్రవారం ప్రార్థనలు ముగియగానే కొందరు గుంపుగా వచ్చి సీఆర్‌పీఎఫ్‌ జవాన్లపై రాళ్లు విసరడం ప్రారంభించారు.

జవాన్లు లాఠీచార్జి చేయడం, బాష్పవాయువు ప్రయోగం వంటి ప్రతి చర్యలకు పాల్పడలేదు. కొద్దిసేపటికే ఆందోళనకారుల సంఖ్య వందకు చేరింది. ప్రతిసారీ  ఈ గుంపునకు నాయకత్వం వహిస్తున్న ఇద్దరు వ్యక్తులు కూడా వచ్చి రాళ్లు రువ్వడం ప్రారంభించారు. దీంతో వారిని చెదరగొట్టేందుకు జవాన్లు బాష్పవాయువు గోళీని ప్రయోగించారు. అప్పటికే ఆందోళనకారుల్లో కలిసిపోయి ఉన్న పోలీసులు అల్లరి మూకకు నాయకత్వం వహిస్తున్న ఇద్దరు వ్యక్తులను ఒడిసి పట్టుకున్నారు. వాహనాల్లోకి ఎక్కించి స్టేషన్‌కు తీసుకువెళ్లారు.
Sat, Sep 08, 2018, 11:31 AM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View