ఆఖరి టెస్ట్‌లో తొలిరోజు భారత్‌ బౌలర్ల హవా
Advertisement
ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఆఖరి టెస్ట్‌లో భారత్‌ బౌలర్లు తొలి ఇన్నింగ్స్‌లో చెలరేగిపోయారు. ఏడువికెట్లు పడగొట్టి స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించారు. సీరిస్‌ గెలుపుతో మంచి ఊపు మీదుంటుందనుకున్న ఆతిథ్య జట్టు ఇంగ్లండు తొలిరోజు తడబడింది. ఓపెనర్లు కుక్‌, జెన్సింగ్స్‌ జోడీ నిలకడగా ఆడుతూ శుభారంభాన్ని ఇచ్చినా వీరిద్దరూ నిష్క్రమించాక ఇంగ్లండ్‌ కోలుకోలేకపోయింది. అలిస్టర్‌ కుక్‌, మొయిన్‌ ఆలీలు అర్ధశతకాలతో రాణించినా 198 పరుగులకే కీలక వికెట్లు కోల్పోయింది.

భారత్‌ బౌలర్ల జోరు చూస్తే ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌కు తొలిరోజే ముగింపు పలుకుతారనిపించింది. చివర్లో బట్లర్‌ (11 నాటౌట్‌), ఆదిల్‌ రషీద్‌ (4 నాటౌట్‌)లు అడ్డుగోడగా నిలవడంతో సాధ్యం కాలేదు. భారత్‌ బౌలర్లలో ఇషాంత్‌ శర్మ మూడు వికెట్లు పడగొట్టగా బుమ్రా, జడేజా చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.
Sat, Sep 08, 2018, 10:36 AM
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View