సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
Advertisement
*  సమంత నటించిన తాజా చిత్రం 'యూ టర్న్' సెన్సార్ పూర్తయింది. దీనికి సెన్సార్ నుంచి U/A సర్టిఫికేట్ లభించింది. రాహుల్ రవీంద్రన్, ఆది పినిశెట్టి ఇతర ముఖ్య పాత్రలు పోషించిన  ఈ చిత్రాన్ని ఈ నెల 13న విడుదల చేస్తున్నారు.
*  విక్రం హీరోగా నటించిన తమిళ చిత్రం 'సామి స్క్వేర్'ను తెలుగులో 'సామి' పేరుతో విడుదల చేస్తారు. హరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కీర్తి సురేశ్ హీరోయిన్ గా నటించింది. ఈ నెల మూడో వారంలో దీనిని తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేస్తారు.
*  బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ప్రముఖ దర్శకుడు తేజ తాజాగా ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. కాజల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. కాగా, ఈ చిత్రంలో ఓ కీలక పాత్రకు తాజాగా బాలీవుడ్ బ్యూటీ మన్నారా చోప్రాను తీసుకున్నారు.
*  సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న తాజా చిత్రానికి 'పేట్ట' అనే టైటిల్ని నిర్ణయించారు. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో త్రిష కథానాయికగా నటిస్తోంది.
Sat, Sep 08, 2018, 07:28 AM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View