డిసెంబరులో ఎవరి అవసరం ఎవరికి వస్తుందో ఎవరికి తెలుసు?: అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్యలు
Advertisement
ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో పెను దుమారం రేపుతున్నాయి. మల్లేపల్లిలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ తర్వాతి ముఖ్యమంత్రి మజ్లిస్ నుంచే అవుతారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

నవంబరులో ఎన్నికలు జరుగుతాయని, డిసెంబరులో తాను సీఎంను అవుతానని కేసీఆర్ చెబుతున్నారని.. నవంబరులో ఎన్నికలు నిజమే అయినా, డిసెంబరులో ఏం జరుగుతుందో ఎవరికి తెలుసని అక్బరుద్దీన్ వ్యాఖ్యానించారు. డిసెంబరులో ఎవరి అవసరం ఎవరికి వస్తుందో ఎవరికి తెలుసని పేర్కొన్నారు. కర్ణాటకలో కుమారస్వామి ముఖ్యమంత్రి అవగా లేనిది, మజ్లిస్ నుంచి ఒకరు ముఖ్యమంత్రి ఎందుకు కాకూడదని ప్రశ్నించారు. డిసెంబరు వరకు వేచి చూద్దామని, ఎవరి అవసరం ఎవరికి వస్తుందో తేలిపోతుందని పేర్కొన్నారు.
Sat, Sep 08, 2018, 06:13 AM
Copyright © 2018; www.ap7am.com
Privacy Policy | Desktop View