ప్రాంతీయ పార్టీలను చీల్చేందుకు మోదీ-కేసీఆర్ కలిసి నాటకం: చంద్రబాబుతో టీడీపీ ముఖ్య నేతలు
Advertisement
ప్రాంతీయ పార్టీలను చీల్చేందుకే మోదీ-కేసీఆర్ కలిసి నాటకమాడుతున్నారని ఏపీ సీఎం చంద్రబాబుతో టీడీపీ ముఖ్య నేతలు అన్నట్టు సమాచారం. ఏపీ అసెంబ్లీలో తన ఛాంబర్ లో పార్టీ ముఖ్యనేతలతో చంద్రబాబు ఈరోజు భేటీ అయ్యారు. ఈ భేటీలో చినరాజప్ప, కళా వెంకట్రావు, దేవినేని ఉమ, పయ్యావుల కేశవ్, ధూళిపాళ్ల నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.

కేసీఆర్  వ్యతిరేక శక్తులన్నీ ఒక తాటిపైకి వస్తున్నాయనే అభిప్రాయాన్ని వెలిబుచ్చుతూ, బీజేపీ అనుకూల పక్షాలకు వ్యతిరేకంగా పోరాడాలని ఆయా నేతలు చెప్పినట్టు తెలుస్తోంది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందని, ఇప్పుడు బీజేపీ ద్రోహం చేసిందని, ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తానని కాంగ్రెస్ అంటోందని, దానికి అడ్డుపడేలా బీజేపీ వ్యవహరిస్తోందని నేతలు అభిప్రాయపడినట్టు సమాచారం. ఇతర పార్టీల వైఖరిని గమనించాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.
Fri, Sep 07, 2018, 07:07 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View