'2.ఓ' టీజర్ రిలీజ్ డేట్ చెప్పేసిన శంకర్
Advertisement
భారీ చిత్రాల దర్శకుడిగా .. ప్రయోగాత్మక చిత్రాల దర్శకుడిగా శంకర్ కి మంచి పేరుంది. బలమైన కథా కథనాలకు భారీతనాన్ని జోడించి అందించడం ఆయన ప్రత్యేకత. ఆయన ఒక సినిమా చేస్తున్నాడు అంటేనే అందరి దృష్టి ఆ సినిమాపైనే వుంటుంది. అలా ఆయన తాజా చిత్రంగా రూపొందుతోన్న '2.ఓ' సినిమా కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఈ సినిమా టీజర్ రిలీజ్ డేట్ ను శంకర్ ఎనౌన్స్ చేశాడు. 'వినాయకచవితి' పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని, ఈ నెల 13వ తేదీన ఈ సినిమా నుంచి టీజర్ ను వదలనున్నట్టు చెప్పాడు. రజనీ అభిమానులందరికీ ఇది శుభవార్తేనని చెప్పాలి. ఈ టీజర్ తో శంకర్ ఏ స్థాయిలో అంచనాలు పెంచుతాడో చూడాలి. అక్షయ్ కుమార్ ప్రతినాయకుడిగా నటించిన ఈ సినిమాలో, కథానాయికగా ఎమీ జాక్సన్ నటించిన సంగతి తెలిసిందే.   
Fri, Sep 07, 2018, 05:00 PM
Copyright © 2018; www.ap7am.com
Privacy Policy | Desktop View