'అదుగో' నుంచి టీజర్ వచ్చేసింది
Advertisement
నటుడిగా విలక్షణమైన పాత్రలను చేస్తూ వచ్చిన రవిబాబు, దర్శకుడిగా కూడా విభిన్నమైన చిత్రాలను తెరకెక్కిస్తూ వస్తున్నాడు. తాజాగా ఆయన 'పందిపిల్ల' ప్రధాన పాత్రగా 'అదుగో' సినిమాను రూపొందించాడు. పూర్తి వినోదభరితంగా నిర్మితమైన ఈ సినిమా నుంచి కొంతసేపటి క్రితమే టీజర్ ను రిలీజ్ చేశారు.

బంటి (పంది పిల్ల) చెప్పినట్టు చేయడం .. డాన్స్ కూడా చేసేయడం చూపించారు. ఈ టీజర్ చిన్నపిల్లలను ఆకట్టుకునేలానే వుంది. కేవలం పంది పిల్లను మాత్రమే చూపిస్తూ టీజర్ ను కట్ చేసిన రవిబాబు, సినిమాపై ఆసక్తిని పెంచడంలో సక్సెస్ అయ్యాడు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించనున్నారు.
Fri, Sep 07, 2018, 04:37 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View