ఆటో, మెటల్స్ అండ.. లాభాలతో వారాన్ని ముగించిన మార్కెట్లు
Advertisement
Advertisement
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు లాభాల్లో ముగిశాయి. ఆటోమొబైట్స్, మెటల్స్ స్టాకుల అండతో లాభాలను నమోదు చేశాయి. తద్వారా ఈ వారాన్ని లాభాలతో ముగించాయి. ఫారిన్ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్లు ఈరోజు రూ. 455 కోట్ల విలువైన షేర్లను అమ్మగా... దేశీయ మదుపరులు రూ. 612 కోట్ల మేర కొనుగోళ్లు జరిపారు. ఈ నేపథ్యంలో, ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి... సెన్సెక్స్ 147 పాయింట్లు లాభపడి 38,390కి ఎగబాకింది. నిఫ్టీ 52 పాయింట్లు పుంజుకుని 11,589కి చేరింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
జుబిలెంట్ లైఫ్ సైన్సెస్ (7.93%), నెట్ వర్క్ 18 మీడియా (6.10%), మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (5.51%), అరబిందో ఫార్మా (5.46%), హీరో మోటోకార్ప్ (5.27%).

టాప్ లూజర్స్:
ఎస్ఈఆర్ఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (-4.72%), ఎస్ బ్యాంక్ (-4.59%), రిలయన్స్ నేవల్ అండ్ ఇంజినీరింగ్ (-4.33%), అదానీ ఎంటర్ ప్రైజెస్ (-3.88%), మోన్శాంటో ఇండియా (-3.73%).   
Fri, Sep 07, 2018, 04:17 PM
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View