తమ్ముడి కోసం రంగంలోకి దిగిన అలీ!
Advertisement
చిత్రపరిశ్రమలో తమకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్న హీరోలు, తమ సోదరులను కూడా రంగంలోకి దింపే ప్రయత్నాలు చేయడం సర్వసాధారణం. ఒక వైపున సాయిధరమ్ తేజ్ సోదరుడు తెరపైకి రావడానికి ప్రయత్నాలు జరుగుతుంటే, మరో వైపున తన తమ్ముడిని హీరోను చేయడానికి విజయ్ దేవరకొండ కూడా ట్రై చేస్తున్నాడు. ఇక ఇదే బాటలో నటుడిగా తన తమ్ముడిని సెటిల్ చేసే బాధ్యతను అలీ తీసుకున్నాడు .. కాకపోతే కొంచెం ఆలస్యమైందంతే.

అలీ తమ్ముడు 'ఖయ్యుమ్' చాలా సినిమాల్లో హీరో ఫ్రెండ్స్ లో ఒకరిగా .. ఇద్దరు ముగ్గురు హీరోల్లో ఒకరిగా కనిపిస్తూ వస్తున్నాడు. అయితే ఇంతవరకూ ఆయనకి సరైన బ్రేక్ రాలేదు. దాంతో ఖయ్యుమ్ హీరోగా రూపొందుతోన్న 'దేశంలో దొంగలు పడ్డారు' సినిమా కోసం అలీ సమర్పకుడిగా మారిపోయాడు. తమ్ముడిని నిలబెట్టడం కోసం అలీ చేస్తోన్న ప్రయత్నం ఎంతవరకూ సక్సెస్ అవుతుందో చూడాలి. గౌతమ్ రాజ్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ క్రైమ్ థ్రిల్లర్, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.   
Fri, Sep 07, 2018, 04:03 PM
Copyright © 2018; www.ap7am.com
Privacy Policy | Desktop View