కేసీఆర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సీపీఐ నారాయణ
Advertisement
తెలంగాణ అసెంబ్లీ రద్దయిన నేపథ్యంలో సీఎం కేసీఆర్ పై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో ఈరోజు మీడియాతో ఆయన మాట్లాడుతూ, కేసీఆర్ లక్ష్మణ రేఖ దాటారని అన్నారు. ముందస్తు ఎన్నికల కోసం కేసీఆర్ చేస్తున్న హడావిడి, ఆయన తీరు చూస్తుంటే.. శోభనం గది నుంచి మధ్య రాత్రి పారిపోయిన పెళ్లికొడుకు, ఇప్పుడు మళ్లీ పెళ్లి చేయండి సత్తా చాటుతా అన్నట్టుగా ఉందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

అంతకుముందు, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రతిపక్ష నేతలపై నీచంగా మాట్లాడే కుసంస్కారి కేసీఆర్ అని, ఎన్నికల కమిషన్ ను నిర్దేశించేలా కేసీఆర్ ప్రకటనలు చేస్తున్నారని విమర్శించారు. స్వతంత్ర రాజ్యాంగ సంస్థ అయిన ఎన్నికల కమిషన్ ను ప్రభావితం చేసేలా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని, ఎన్నికల తేదీలను ఆయన ప్రకటించడంపై తాము అభ్యంతరం వ్యక్తం చేస్తున్నామని, ఈ విషయాన్ని ఎన్నికల ప్రధానాధికారి దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. ఈ సందర్భంగా తెలంగాణ అసెంబ్లీ రద్దుపై సురవరం స్పందిస్తూ, ఎటువంటి చర్చ లేకుండా అసెంబ్లీ రద్దు చేస్తూ కేబినెట్ లో తీర్మానం చేశారని, పార్టీ పొలిట్ బ్యూరోతో సంబంధం లేకుండా అభ్యర్థుల పేర్ల జాబితాను విడుదల చేశారని సురవరం విమర్శించారు.
Fri, Sep 07, 2018, 03:44 PM
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View