ఈనెల 12న 'జియోఫోన్‌ 2' నాలుగో ఫ్లాష్‌సేల్‌!
Advertisement
'జియో ఫోన్ 2' కొనాలనుకునే వారి కోసం రిలయెన్స్ కంపెనీ మరో ఫ్లాష్ సేల్ ని ప్రకటించింది. ఇప్పటి వరకు మూడు ఫ్లాష్ సేల్ లని నిర్వహించిన జియో, తాజాగా ఈనెల 12న నాలుగో విడత సేల్ ని నిర్వహించనున్నట్లు ప్రకటించింది. గత మూడు ఫ్లాష్‌ సేల్స్‌లలో ఈ ఫోన్ కి ఉన్న డిమాండ్ కారణంగా నిమిషాల వ్యవధిలోనే అమ్ముడైపోయాయి. నాలుగో విడత ఫ్లాష్ సేల్‌లో భాగంగా పరిమిత సంఖ్యలో ఈ ఫోన్లు అందుబాటులో ఉంటాయని, ఆర్డర్ చేసిన వారికి వారం లోపు డెలివరీ చేస్తామని సంస్థ తెలిపింది. కాగా, ఈ ఫోన్ 'ఫ్లాష్ సేల్‌' జియో అధికారిక వెబ్‌సైట్ లో ఉంటుంది. దీని ధర రూ.2999గా ఉంది.
Fri, Sep 07, 2018, 03:37 PM
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View