తల్లి కాదు సైకో.. ఫోన్ కు బానిసై కన్నబిడ్డలను తీవ్రంగా హింసించిన అభిరామి!
Advertisement
ప్రియుడి మోజులో పడి ఇద్దరు కన్నబిడ్డలకు పాలలో విషం కలిపి హత్యచేసిన అభిరామి(25) గురించి పోలీసులు ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. సెల్ ఫోన్ కు బానిసగా మారిపోయిన అభిరామి ఇంట్లో సైకోలా ప్రవర్తించేదని పోలీసులు తెలిపారు. ప్రేమగా దగ్గరకు వచ్చే పిల్లలను అభిరామి కసిరికొట్టేదనీ, వారిని తీవ్రంగా హింసించేదని పేర్కొన్నారు. భర్త ఆఫీసుకు వెళ్లగానే ప్రియుడు సుందరంతో గంటలకొద్దీ వీడియో కాల్ మాట్లాడుతూ గడిపేదన్నారు.

తొలుత భర్త విజయన్ ను కూడా హతమార్చి ప్రియుడితో పారిపోవాలని అభిరామి అనుకుందనీ, కానీ అతను బ్యాంకు నుంచి ఆలస్యంగా రావడంతో పిల్లాడు అజయ్(7) అమ్మాయి కరిమిలా(5)కు పాలలో విషం కలిపి ఇచ్చి పారిపోయిందని పోలీసులు తెలిపారు.

చెన్నైకి చెందిన విజయన్ ఓ ప్రైవేటు బ్యాంకులో ఉద్యోగం చేస్తుండగా, ఇంట్లోనే ఉంటున్న అభిరామికి స్థానికంగా ఓ హోటల్ లో పనిచేస్తున్న సుందరం అనే యువకుడితో పరిచయమైంది. అదికాస్తా ప్రేమగా మారడంతో భర్త, పిల్లలను చంపేసి అతడితో వెళ్లిపోవాలని నిర్ణయించుకుంది.
Fri, Sep 07, 2018, 03:30 PM
Copyright © 2018; www.ap7am.com
Privacy Policy | Desktop View