అక్టోబర్ నుంచి సెట్స్ పైకి గోపీచంద్ కొత్త చిత్రం?
Advertisement
కొంతకాలంగా గోపీచంద్ సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఈసారి తప్పకుండా హిట్ కొట్టాలనే పట్టుదలతో కొత్త దర్శకుడు కుమార్ తో ఒక సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఆ సినిమా షూటింగులోనే ఆయన బిజీగా వున్నాడు. లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా తరువాత సంపత్ నందితో మరో సినిమా చేయడానికి గోపీచంద్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు.

గతంలో సంపత్ నంది .. గోపీచంద్ కాంబినేషన్లో వచ్చిన 'గౌతమ్ నంద' పరాజయం పాలైంది. అయినా ఈసారి సంపత్ నంది వినిపించిన కథ కొత్తగా అనిపించడంతో 'ఓకే .. చేసేద్దాం' అన్నాడట. గోపీచంద్ మళ్లీ ఛాన్స్ ఇవ్వడంతో ఆయనకి తప్పకుండా హిట్ ఇవ్వడం కోసం సంపత్ నంది గట్టిగానే కసరత్తు చేస్తున్నాడని సమాచారం. అక్టోబర్లో ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లే దిశగా సన్నాహాలు జరుగుతున్నాయి.  
Fri, Sep 07, 2018, 03:19 PM
Copyright © 2018; www.ap7am.com
Privacy Policy | Desktop View