బీజేపీ ఎమ్మెల్యే రామ్ కదమ్ నాలుక కోయండి.. రూ.5 లక్షలు పట్టుకెళ్లండి!: కాంగ్రెస్ నేత ఆఫర్
Advertisement
యువకులు కోరితే వారికి నచ్చిన అమ్మాయిలను కిడ్నాప్ చేసి తీసుకొస్తానని వ్యాఖ్యానించి మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే రామ్ కదమ్ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత, మహారాష్ట్ర మాజీ మంత్రి సుబోధ్ సావ్జీ స్పందించారు. రామ్ కదమ్ నాలుకను కోసినవారికి రూ.5  లక్షల నజరానా ఇస్తానని ఆయన ప్రకటించారు. కదమ్ వ్యాఖ్యలు అత్యంత అభ్యంతరకరంగా ఉన్నాయనీ, మహరాష్ట్రలో సాక్షాత్తూ ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఇక మహిళలకు రక్షణ ఎక్కడుంటుందని సుబోధ్ ప్రశ్నించారు.

ఇటీవల ఘట్కోపర్ నియోజకవర్గంలో జరిగిన ఉట్టి ఉత్సవంలో కదమ్ పాల్గొన్నారు. అనంతరం అక్కడ యువకులను ఉద్దేశించి మాట్లాడుతూ..‘మీకు నచ్చిన అమ్మాయికి ప్రపోజ్ చేయండి. ఆమె నో అంటే నాకు ఫోన్ చేయండి. నేను మీకు తప్పకుండా సాయం చేస్తా. ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసైనా మీతో వివాహం జరిపిస్తాను’ అని ప్రకటించారు. ఈ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం చెలరేగడంతో ఎట్టకేలకు క్షమాపణలు చెప్పారు. తన వ్యాఖ్యలను ఎడిట్ చేసి దుష్ప్రచారం చేశారని వ్యాఖ్యానించారు.
Fri, Sep 07, 2018, 02:29 PM
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View