'యాత్ర' నుంచి స్పెషల్ పోస్టర్ .. వైయస్సార్ ను గుర్తుకు తెస్తోన్న మమ్ముట్టి
Advertisement
మలయాళ స్టార్ హీరోగా మమ్ముట్టి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. మొదటి నుంచి కూడా ఆయన బలమైన కథాకథనాలకే ప్రాధాన్యతనిస్తూ వస్తున్నారు. ఈ కారణంగా ఆయన ఖాతాలో చెప్పుకోదగిన సినిమాలు చాలానే కనిపిస్తాయి. తనకి నచ్చిన పాత్రలు వస్తే ఇతర భాషల్లో చేయడానికి కూడా ఆయన ఎంతో ఉత్సాహాన్ని చూపిస్తుంటారు. అలా ప్రస్తుతం ఆయన 'యాత్ర' సినిమా చేస్తున్నారు.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితచరిత్రగా ఈ సినిమా నిర్మితమవుతోంది. కొంతకాలం క్రితం ఈ సినిమా నుంచి వదిలిన ఫస్టులుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ రోజున మమ్ముట్టి పుట్టినరోజు కావడంతో, ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సినిమా టీమ్ ఒక స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేసింది. ఈ పోస్టర్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డిని గుర్తుకు తెస్తూ మమ్ముట్టి ఆకట్టుకుంటున్నాడు. మహి.వి రాఘవ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.   
Fri, Sep 07, 2018, 12:21 PM
Copyright © 2018; www.ap7am.com
Privacy Policy | Desktop View