'ఆపద్ధర్మ ప్రభుత్వం' అనే పదం ఎప్పుడు ప్రాచుర్యంలోకి వచ్చిందంటే..!
Advertisement
తెలంగాణ అసెంబ్లీ రద్దు కావడంతో ప్రస్తుతం రాష్ట్రంలో ఆపద్ధర్మ ప్రభుత్వం కొనసాగుతోంది. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కేసీఆర్ కొనసాగుతున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యేంతవరకు ఆపద్ధర్మ ప్రభుత్వం కొనసాగుతుంది. ఈ సందర్భంగా, అసలు ఆపద్ధర్మ ప్రభుత్వం అనేది ఎప్పుడు ప్రచారంలోకి వచ్చిందో తెలుసుకుందాం.

అప్పుడే రెండో ప్రపంచ యుద్ధం ముగిసింది. యూకే ప్రధానిగా విన్ స్టన్ చర్చిల్ కొనసాగుతున్నారు. కన్జర్వేటివ్ పార్టీకి చెందిన విన్ స్టన్ చర్చిల్... తన పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావాలన్న యోచనతో, ఇంగ్లండ్ రాజుకు తన రాజీనామాను సమర్పించారు. ఆ మరుసటి రోజే ఇంగ్లండ్ రాజు చర్చిల్ ను పిలిచి, ఎన్నికలు పూర్తయ్యేంత వరకు కార్యనిర్వహణ బాధ్యతలను చూసుకోవాలని చెప్పారు. ఆ ప్రభుత్వానికి కేర్ టేకర్ గవర్నమెంట్ (ఆపద్ధర్మ ప్రభుత్వం)గా నామకరణం చేశారు. అప్పుడే ఆపద్ధర్మ ప్రభుత్వం అనే పదం బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది.
Fri, Sep 07, 2018, 12:03 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View