తెలుగు .. తమిళ భాషల్లో 'నోటా' రిలీజ్ డేట్ ఖరారు
Advertisement
విజయ్ దేవరకొండ హీరోగా ఆనంద్ శంకర్ దర్శకత్వంలో తెలుగు .. తమిళ భాషల్లో 'నోటా' సినిమా రూపొందింది. మెహ్రీన్ కథానాయికగా నటించిన ఈ సినిమాను, అక్టోబర్ 4వ తేదీన విడుదల చేయాలని దర్శక నిర్మాతలు నిర్ణయించుకున్నారు. దసరా రోజుల్లో తెలుగు .. తమిళ భాషల్లో గట్టిపోటీనే వుంది. అందువలన కాస్త ముందుగానే ఈ సినిమాను విడుదల చేయడం మంచిదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం.

ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ఒక సాధారణ యువకుడిగా .. ముఖ్యమంత్రిగా కనిపించనున్నాడు. రీసెంట్ గా వదిలిన ట్రైలర్ కి అనూహ్యమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ ట్రైలర్ వలన ఈ సినిమాపై అంచనాలు కూడా పెరిగాయి. విజయ్ దేవరకొండ ఖాతాలో మరో హిట్ చేరిపోవడమే కాదు, ఆయన కెరియర్లో చెప్పుకోదగిన చిత్రమవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 
Fri, Sep 07, 2018, 11:59 AM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View