కలసి ఉండాలని చెబుతూనే జాగో, భాగో అంటున్నారు!: కేసీఆర్ పై మంత్రి లోకేశ్ ఫైర్
Advertisement
టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ ఈ రోజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓవైపు తెలుగువారంతా కలిసి ఉండాలని చెబుతున్న కేసీఆర్ మరో వైపేమో ఆంధ్రావాళ్లు భాగో, తెలంగాణ ప్రజలు జాగో అంటూ కామెంట్లు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీలో టీడీపీ నేతలు ఎంతమంది ఉన్నారో అందరికీ తెలుసని లోకేశ్ అన్నారు. ఆంధ్రుల ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యేలను కేసీఆర్ తన పక్కన కూర్చోబెట్టుకున్నారని మంత్రి వెల్లడించారు.

ఈ రోజు అమరావతిలో అసెంబ్లీ సమావేశాల సందర్భంగా విలేకరులతో లోకేశ్ ముచ్చటించారు. ఆంధ్రుల ఓట్లు లేకుండానే టీఆర్ఎస్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో గెలుపొందిందా? అని ప్రశ్నించారు. ఓవైపు తెలుగువారంతా కలసి ఉండాలని చెబుతున్న కేసీఆర్.. మరోవైపేమో భాగో, జాగో అంటూ కామెంట్లు చేస్తున్నారన్నారు.
Fri, Sep 07, 2018, 11:30 AM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View