ఎన్టీఆర్ పాత్ర అలాగే ఉండాలి .. మార్చొద్దు: హీరో విశాల్
Advertisement
ఎన్టీఆర్ కెరియర్లో చెప్పుకోదగిన సినిమాల్లో 'టెంపర్' ఒకటి. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, 2015లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కాజల్ కథానాయికగా నటించిన ఈ సినిమా భారీ విజయాన్ని సాధించింది. దాంతో ఈ సినిమాను పలు భాషల్లో రీమేక్ చేస్తున్నారు. తమిళ రీమేక్ లో విశాల్ హీరోగా చేస్తున్నాడు. 'ఠాగూర్' మధు నిర్మిస్తోన్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇటీవలే మొదలైంది.ఈ సినిమా ద్వారా వెంకట్ మోహన్ దర్శకుడిగా పరిచయం కానున్నాడు. షూటింగుకి ముందు .. కథలోను .. కొన్ని సన్నివేశాల్లోను మార్పులు చేద్దామని విశాల్ తో దర్శకుడు చెప్పాడట. ఇతర పాత్రలు .. సన్నివేశాల విషయంలో అవసరమనుకుంటేనే చిన్న చిన్న మార్పులు చేయమని విశాల్ అన్నాడట. ఇక ఎన్టీఆర్ పాత్ర విషయంలో మాత్రం ఎలాంటి మార్పులు చేయవద్దనీ .. ఆ సినిమాను నిలబెట్టింది ఆయన క్యారెక్టరైజేషనే అని గట్టిగానే చెప్పాడట. రాశి ఖన్నా కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా ఆయనకి అక్కడ హిట్ తెచ్చిపెడుతుందేమో చూడాలి.  
Fri, Sep 07, 2018, 11:25 AM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View