మైనర్ బాలికపై అత్యాచారం.. ఐటీ శాఖ డిప్యూటీ కమిషనర్ అరెస్ట్
Advertisement
తన ఇంట్లో పని చేస్తున్న మైనర్ బాలికపై అత్యాచారం చేసిన ఆదాయపు పన్ను శాఖ డిప్యూటీ కమిషనర్ ను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే, ముంబైలో ఐటీ శాఖ డిప్యూటీ కమిషనర్ గా పని చేస్తున్న ఓ వ్యక్తికి భార్యతో విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో వారు విడివిడిగా ఉంటున్నారు. ఆయన వద్ద 17 ఏళ్ల ఓ బాలిక పని చేస్తోంది. తనపై డిప్యూటీ కమిషనర్ అత్యాచారం చేశాడని సదరు బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో, ఆయనను అరెస్ట్ చేసి, అత్యాచారం కేసు నమోదు చేశారు. బాలికను వైద్య పరీక్ష కోసం ఆసుపత్రికి తరలించారు. 
Fri, Sep 07, 2018, 10:56 AM
Copyright © 2018; www.ap7am.com
Privacy Policy | Desktop View