'గీత గోవిందం' వదులుకున్నందుకు బాధ పడుతున్నాను: అనూ ఇమ్మాన్యుయేల్
Advertisement
సరైన హిట్ పడాలేగానీ .. స్టార్ డమ్ వచ్చేయడానికి పెద్దగా సమయం పట్టదు. కాలం కలిసొచ్చి ఒకటి రెండు సినిమాలతోనే స్టార్ డమ్ తెచ్చేసుకున్నవాళ్లు లేకపోలేదు. ఇక తాము వదులుకున్న సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయినప్పుడు సహజంగానే వాళ్లు బాధపడటం జరుగుతూ ఉంటుంది. ప్రస్తుతం అలాంటి పరిస్థితిలోనే అనూ ఇమ్మాన్యుయేల్ వుంది.

తాజాగా 'శైలజా రెడ్డి అల్లుడు' సినిమా ప్రమోషన్స్ లో ఆమె మాట్లాడుతూ .. 'గీత గోవిందం' గురించి కూడా ప్రస్తావించింది. "ముందుగా ఈ సినిమాలో కథానాయికగా చేసే ఛాన్స్ నాకు వచ్చింది. అయితే అప్పటికే నేను 'నా పేరు సూర్య' సినిమాతో బిజీగా వున్నాను. ఇక 'శైలాజా రెడ్డి అల్లుడు' కూడా ఒప్పుకుని వున్నాను. అందువల్లనే 'గీత గోవిందం' చేయలేకపోయాను. ఈ సినిమాను నేను ఇంకా చూడలేదు .. కానీ ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని సాధించిందనేది చూస్తూనే వున్నాను. ఈ సినిమా హిట్ అయినందుకు ఆనందంగా వుంది .. నేను చేయలేకపోయానే అనే బాధ కూడా వుంది" అని చెప్పుకొచ్చింది. 
Fri, Sep 07, 2018, 10:50 AM
Copyright © 2018; www.ap7am.com
Privacy Policy | Desktop View