మేయర్ బొంతు రామ్మోహన్ కు నిరాశ.. ఫోన్ స్విచ్చాఫ్
Advertisement
హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్ అలకబూనారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించిన 105 మంది అభ్యర్థుల జాబితాలో తన పేరు లేకపోవడంపై ఆయన నిరాశకు గురయ్యారు. ఉప్పల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని రామ్మోహన్ ఆశించారు. ఆయన కార్పొరేటర్ గా వ్యవహరిస్తున్న చర్లపల్లి డివిజన్ ఉప్పల్ నియోజకవర్గం కిందకు వస్తుంది.

 నగర మేయర్ గా ఉన్నప్పటికీ... ఉప్పల్ నియోజకవర్గంపై ఆయన ఎక్కువ దృష్టి సారించేవారు. టీఆర్ఎస్ లోని ముఖ్య నేతల సూచనల మేరకు నియోజకవర్గంలో ఎక్కువగా పర్యటించేవారు. అయితే, ఆయన ఆశలపై కేసీఆర్ నీళ్లు చల్లారు. టికెట్ ను భేతి సుభాష్ రెడ్డికి ఖరారు చేశారు. దీంతో, మనస్తాపానికి గురైన రామ్మోహన్... నిన్న జరిగిన జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ మీటింగ్ కు కూడా హాజరుకాలేదు. ఫోన్ కూడా స్విచ్చాఫ్ చేసుకున్నారు.
Fri, Sep 07, 2018, 10:39 AM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View