బాలీవుడ్ బయోపిక్ .. క్రికెటర్ పాత్రలో బన్నీ
Advertisement
కొంతకాలంగా హిందీలో బయోపిక్ ల జోరు కొనసాగుతోంది. కొన్ని బయోపిక్ లు విశేషమైన ఆదరణ పొందడం .. భారీ వసూళ్లను రాబట్టడం వలన, కొత్తగా సెట్స్ పైకి వెళ్లే బయోపిక్ ల సంఖ్య పెరిగిపోతూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే బన్నీ ఓ బాలీవుడ్ మూవీ చేయనున్నట్టుగా ఫిల్మ్ నగర్లో ఒక వార్త షికారు చేస్తోంది. కబీర్ ఖాన్ దర్శకత్వంలో బాలీవుడ్లో కపిల్ దేవ్ బయోపిక్ ను రూపొందించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

1983లో కపిల్ సారథ్యంలో ఇండియన్ క్రికెట్ టీమ్ తొలిసారిగా ప్రపంచ కప్ ను గెలుచుకుంది. ఈ విజయంలో కృష్ణమాచారి శ్రీకాంత్ కూడా ముఖ్యమైన పాత్రను పోషించారు. కపిల్ దేవ్ పాత్రకు రణ్ వీర్ సింగ్ ను ఎంపిక చేసుకున్నారు. ఇక కృష్ణమాచారి శ్రీకాంత్ పాత్రకి గాను అల్లు అర్జున్ తో సంప్రదింపులు జరుపుతున్నారట. ఈ సినిమాకి '83' అనే టైటిల్ ను ఖరారు చేశారు. బన్నీ ఓకే అంటే ఆయన బాలీవుడ్ లో చేసే మొదటి సినిమా ఇదే అవుతుంది.    
Fri, Sep 07, 2018, 10:30 AM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View