అఖిల్ మూవీ టైటిల్ ఖరారైపోయినట్టే!
Advertisement
అఖిల్ తన మూడవ సినిమాను వెంకీ అట్లూరి దర్శకత్వంలో చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగు దశలో వుంది. ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఈ రొమాంటిక్ లవ్ స్టోరీకి 'మిస్టర్ మజ్ను' అనే టైటిల్ ను పరిశీలిస్తూ వస్తున్నారు. మంచి ఫీడ్ బ్యాక్ రావడంతో ఇదే టైటిల్ ను ఖరారు చేశారనేది తాజా సమాచారం. త్వరలోనే ఈ టైటిల్ ను అధికారికంగా ప్రకటించనున్నారట.

ఈ సినిమాలో అఖిల్ జోడీగా నిధి అగర్వాల్ నటిస్తోంది. గతంలో వెంకీ అట్లూరి నుంచి వచ్చిన 'తొలిప్రేమ' ఘన విజయాన్ని సాధించింది. దాంతో సహజంగానే ఈ సినిమాపై భారీ అంచనాలు వున్నాయి. ఇంతకు ముందు అఖిల్ నుంచి రెండు భారీ సినిమాలు వచ్చినా అవి ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయాయి. అందువలన ఈ సారి తనకి తప్పకుండా హిట్ పడాలనే పట్టుదలతో అఖిల్ వున్నాడు.   
Fri, Sep 07, 2018, 10:11 AM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View