‘కన్నానులే’ పాటతో 'అమ్మ' జయలలితను ఆనందపరిచిన రెహ్మాన్
Advertisement
  తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత సినీ నేపథ్యం నుంచి వచ్చినవారు. కాబట్టి ఆమెకు సినీ గీతాల పట్ల మక్కువ ఎక్కువగానే ఉంటుంది. ఆమెకు ఏఆర్ రెహ్మాన్ స్వరపరిచిన ‘కన్నానులే ’ పాటంటే చాలా ఇష్టమట. ఈ విషయాన్ని ప్రముఖ తమిళ గీత రచయిత వైరముత్తు స్వయంగా వెల్లడించారు. చెన్నైలో ‘నవాబ్’ ఆడియో లాంచ్ వేడుక సందర్భంగా ఈ ఆసక్తికర విషయాన్ని ఆయన ప్రేక్షకులతో పంచుకున్నారు.
 
 మణిరత్నం దర్శకత్వంలో ఈ చిత్రం ‘చెక్క చీవంత వాణం’ అనే టైటిల్‌తో తెరకెక్కుతోంది. ఈ సినిమా ఆడియో లాంచ్ వేడుక సందర్భంగా వైరముత్తు మాట్లాడుతూ.. ‘అమ్మకు రెహ్మాన్ పాటలంటే చాలా ఇష్టం. ముఖ్యంగా బాంబే చిత్రంలోని ‘కన్నానులే...’ పాటంటే మరింత ఇష్టం. కొన్నేళ్ల క్రితం అమ్మ రెహ్మాన్ స్టూడియోకు వచ్చి ఏదైనా పాట పాడమనగానే.. రెహ్మాన్ అదే పాటను పాడి వినిపించారు. ఆ పాట విన్న అమ్మ మైమరచిపోయారు’ అని వెల్లడించారు.
Fri, Sep 07, 2018, 10:04 AM
Copyright © 2018; www.ap7am.com
Privacy Policy | Desktop View