‘హాలీవుడ్ లో ఛాన్స్ ఎందుకు రాలేదు?’ అన్న ప్రశ్నకు స్పందించిన షారుక్ ఖాన్
Advertisement
వేల కోట్ల ఆస్తి, కోట్లాది మంది అభిమానులు, సొంత సినిమా నిర్మాణ సంస్థ.. ఇన్ని ఉన్నా బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ కు తీరని కోరిక ఒకటి ఉంది. అదే హాలీవుడ్ సినిమాలో నటించడం. తోటి నటులు ఓంపురి, ఐశ్వర్యారాయ్, ప్రియాంక చోప్రా, ఇర్ఫాన్ ఖాన్ తదితరులు చక్కటి ఆఫర్లతో అక్కడ రాణిస్తుంటే.. షారుక్ కు హాలీవుడ్ ఆఫర్ ఇప్పటివరకూ రాలేదు. ఈ విషయమై ఓ మీడియా ప్రతినిధి షారుక్ ను డైరెక్ట్ గా ప్రశ్న అడిగేశాడు. దీంతో ఈ ప్రశ్నకు అంతే ఫన్నీగా జవాబిచ్చిన కింగ్ ఖాన్ అందరి ముఖాల్లో నవ్వులు పూయించాడు.

ముంబైలో జరిగిన మీడియా సమావేశంలో..‘మీకు హాలీవుడ్ లో ఆఫర్లు ఎందుకు రావడం లేదు?’ అని ఓ విలేకరి షారుక్ ను ప్రశ్నించాడు. దీనికి షారుక్ జవాబిస్తూ..‘నేను రోజూ చంద్రుడిని చూస్తాను. అలాగని దాని దగ్గరకు వెళ్లలేను కదా. ఓంపురి నుంచి ప్రియాంక వరకూ అందరూ హాలీవుడ్ లో రాణిస్తున్నారు. కానీ నాకు ఒక్క అవకాశం కూడా రావడం లేదు. వాళ్ల స్థాయిని నేను ఎందుకు చేరుకోలేకపోతున్నానో అర్థం కావడం లేదు. బహుశా నేను ఇంగ్లిష్ లో వీక్ కావడంతోనే అవకాశాలు రావడం లేదేమో?’ అని షారుక్ చమత్కరించాడు.
Fri, Sep 07, 2018, 09:58 AM
Copyright © 2018; www.ap7am.com
Privacy Policy | Desktop View