సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
Advertisement
*  తాను సెట్లో కూడా ఇంట్లో వున్నట్టుగానే ఉంటానని చెబుతోంది కథానాయిక అనుపమ పరమేశ్వరన్. 'సెట్లో సీరియస్ గా కాకుండా.. ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చేస్తూ వుండాలి. అప్పుడే మనం పాత్రలో బాగా ఇన్వాల్వ్ అయి నటించగలుగుతాం. అందుకే నేను ఇంట్లో వున్నట్టుగానే సెట్లో కూడా సరదాగా అందరితోనూ కలుపుగోలుగా వుంటాను' అని చెప్పింది అనుపమ.
*  తమిళ హీరో ధనుశ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఓ చిత్రంలో నాగార్జున ఓ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో రూపొందే ఈ చిత్రం షూటింగ్ నిన్న మొదలైంది. ఇందులో ధనుశ్ సరసన అదితీరావు హైదరి హీరోయిన్ గా నటిస్తోంది.
*  సీనియర్ నటుడు అర్జున్ హీరోగా నటించిన 'కురుక్షేత్రం' చిత్రాన్ని వినాయక చవితి సందర్భంగా ఈ నెల 13న విడుదల చేస్తున్నారు. ఇందులో సుమన్, సుహాసిని తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.
*  అడవి శేష్ హీరోగా శశికిరణ్ తిక్క దర్శకత్వంలో వచ్చిన 'గూఢచారి' చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఈ క్రమంలో ఈ చిత్రం ఫుల్ రన్ లో ప్రపంచ వ్యాప్తంగా 11 కోట్ల షేర్ ను వసూలు చేసినట్టు సమాచారం.
Fri, Sep 07, 2018, 07:23 AM
Copyright © 2018; www.ap7am.com
Privacy Policy | Desktop View