కేసీఆర్ తన స్థాయి మరిచి లుచ్ఛా మాటలు మాట్లాడాడు: ఉత్తమ్ కుమార్ రెడ్డి
Advertisement
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని బఫూన్ తో పోల్చిన సీఎం కేసీఆర్ పై టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో ఆయన మాట్లాడుతూ, ‘కేసీఆర్ తన స్థాయి మరిచి, విద్యను మరిచి లుచ్ఛా మాటలు మాట్లాడాడు. జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, రాహుల్ గాంధీ గురించి మాట్లాడే స్థాయి కేసీఆర్ ది కాదు. తెలంగాణ రాష్ట్రం కోసం ఆరోజున కాంగ్రెస్ వాళ్ల కాళ్లు పట్టుకున్న కేసీఆర్, ఈరోజున కళ్లు నెత్తికెక్కి, పొగరుతో, అహంకారంతో ఇలా మాట్లాడటాన్ని యావత్తు తెలంగాణ సమాజం ఖండిస్తోంది.

నాలుగున్నరేళ్ల పాటు కేసీఆర్, ఆయన కుటుంబసభ్యులు తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్నారు. ఒక బందిపోటు దొంగల ముఠాలా, తెలంగాణను దోచుకుని, ఈ రాష్ట్రం ఏర్పడటానికి కారణమైన ‘గాంధీ’ కుటుంబం గురించి అడ్డగోలుగా మాట్లాడటం తగదని ఆయన విమర్శించారు. తెలంగాణ సమాజం కేసీఆర్ ని, టీఆర్ఎస్ ను బొందపెట్టడానికి సిద్ధమవుతోంది. టీఆర్ఎస్ పార్టీకి గోరీ కట్టాలి. అతనికి పోయే కాలమొచ్చి శాసనసభను రద్దు చేసుకున్నాడు. తప్పనిసరిగా తెలంగాణ ప్రజలు బొందబెడతారు.. కేసీఆర్ కుటుంబాన్ని తరిమి కొడతారు’ అంటూ ఘాటుగా విమర్శించారు.
Thu, Sep 06, 2018, 07:37 PM
Copyright © 2018; www.ap7am.com
Privacy Policy | Desktop View