ఆ రెండు సినిమాల గురించి అనసూయ అలా చెప్పేసింది
Advertisement
బుల్లితెరపైనే కాదు వెండితెరపై కూడా మెరుస్తూ తన అభిమానుల సంఖ్యను అనసూయ అమాంతంగా పెంచేసుకుంది. తమ సినిమాల్లో అనసూయ కోసం ప్రత్యేక పాత్ర ఉండేలా దర్శక నిర్మాతలు ఉత్సాహాన్ని చూపుతున్నారు. అనసూయ ఇంతవరకూ చేసిన సినిమాల్లో 'క్షణం' .. 'రంగస్థలం' సినిమాలు మంచిపేరు తెచ్చిపెడితే, 'విన్నర్' .. 'గాయత్రి' సినిమాలు మాత్రం ఆమెను నిరాశ పరిచాయనే టాక్ వుంది.

అయితే తాజాగా అనసూయ మాట్లాడుతూ ఆ రెండు సినిమాలు కూడా తనకి అసంతృప్తిని ఇవ్వలేదనీ .. ఆనందాన్నే ఇచ్చాయని అంది. " 'విన్నర్' సినిమాలో 'సూయ .. సూయ .. అనసూయ' అంటూ నా పేరుతోనే ఒక పాట ఉంటుంది. నా పేరుతో ఒక పాట ఎప్పటికీ ఉండిపోవడం కంటే నాకు కావలసినదేముంటుంది? అందువలన 'విన్నర్' నాకు ఓ మంచి జ్ఞాపకంగానే భావిస్తాను. ఇక 'గాయత్రి' సినిమా సరిగ్గా ఆడకపోయినా, మోహన్ బాబుగారితో కలిసి నటించడం ఒక అదృష్టమనే అనుకుంటాను. ఈ సినిమాలో నటన పరంగా నాకు మంచి మార్కులు పడ్డాయి కూడా. అందువలన ఈ రెండు సినిమాలు నాకు మంచి చేశాయనే భావిస్తూ వుంటాను" అని చెప్పుకొచ్చింది.   
Thu, Sep 06, 2018, 06:11 PM
Copyright © 2018; www.ap7am.com
Privacy Policy | Desktop View