ఎన్టీఆర్ .. సునీల్ కాంబినేషన్లో అదిరిపోయే కామెడీ
Advertisement
ఎన్టీఆర్ .. పూజా హెగ్డే జంటగా 'అరవింద సమేత వీర రాఘవ' సినిమా రూపొందుతోంది. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా, ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. తదుపరి షెడ్యూల్లో ఒక పాటను యూరప్ లో చిత్రీకరించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. దసరా కానుకగా ఈ సినిమాను అక్టోబర్ 11వ తేదీన విడుదల చేయనున్నారు.

చాలాకాలం తరువాత ఈ సినిమాలో సునీల్ కమెడియన్ గా కనిపించనున్నాడు. ఒక రకంగా కమెడియన్ గా ఆయన రీ ఎంట్రీ ఇస్తోన్న సినిమా ఇదేనని చెప్పాలి. త్రివిక్రమ్ సినిమా అంటే మామూలుగానే పంచ్ డైలాగ్స్ ఉంటాయి. ఇక కామెడీ సీన్స్ లో ఈ మోతాదు మరింత ఎక్కువగా ఉంటుంది. ఎన్టీఆర్ .. సునీల్ కాంబినేషన్లో వచ్చే కామెడీ సీన్స్  ఒక రేంజ్ లో ఉంటాయట.

ఈ సినిమాలో వీళ్లిద్దరూ గురుశిష్యులుగా కనిపించనున్నారని టాక్. ఎన్టీఆర్ తో 'గురువుగారూ .. గురువుగారూ' అని పిలిపించుకుంటూ ఆయనతో కలిసి సునీల్ చేసే కామెడీ చూడాల్సిందేనని అంటున్నారు. సినిమా మొత్తం కూడా ఎన్టీఆర్ తో కలిసి సునీల్ చేసే అల్లరి .. ఆడియన్స్ ను కడుపుబ్బా నవ్విస్తుందని చెబుతున్నారు. 'అదుర్స్' సినిమాలో ఎన్టీఆర్ .. బ్రహ్మానందం మాదిరిగా ఈ సినిమాలో ఎన్టీఆర్ .. సునీల్ సందడి చేస్తారన్నమాట. ఈ సినిమాతో కమెడియన్ గా సునీల్ మళ్లీ బిజీ కావడం ఖాయమని అంటున్నారు.        
Thu, Sep 06, 2018, 05:07 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View