దుమ్మురేపేస్తోన్న 'నోటా' ట్రైలర్
Advertisement
విజయ్ దేవరకొండ హీరోగా ఆనంద్ శంకర్ దర్శకత్వంలో 'నోటా' సినిమా రూపొందుతోంది. తెలుగు  .. తమిళ భాషల్లో ఈ సినిమా నిర్మితమవుతోంది. ముందుగా చెప్పినట్టుగానే ఈ సినిమా నుంచి కొంతసేపటి క్రితం ట్రైలర్ ను రిలీజ్ చేశారు. విజయ్ దేవరకొండ .. మెహ్రీన్ .. నాజర్ .. సత్యరాజ్ వంటి ప్రధానమైన పాత్రలను కవర్ చేస్తూ ఈ ట్రైలర్ ను కట్ చేశారు. విజయ్ దేవరకొండ ఒక సాధారణ యువకుడిగాను .. యువ నాయకుడిగాను ఈ ట్రైలర్ లో కనిపించాడు.

'ఇది ముఖ్యమంత్రి పదవా .. మ్యూజికల్ చైర్ ఆటా?' అంటూ మెహ్రీన్ చెప్పిన డైలాగ్, 'ఒక స్టేట్ ఫ్యూచర్ అంతా ఒక స్వామిజీ చేతుల్లోనా?' అనే విజయ్ దేవరకొండ డైలాగ్ ఆకట్టుకునేలా వున్నాయి. 'ఈ గేమ్ లో నువ్వు చూసే రక్తం నిజం .. నీ శత్రువులు నిజం .. ఆడటం మొదలు పెట్టావో ఆపడం నీ చేతుల్లో వుండదు .. లైఫ్ ఆర్ డెత్' అంటూ నాజర్ చెప్పిన డైలాగ్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ ట్రైలర్ తో సినిమాపై అంచనాలు పెంచడంలో ఈ సినిమా టీమ్ సక్సెస్ అయిందనే చెప్పాలి. 
Thu, Sep 06, 2018, 04:40 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View