'శైలజా రెడ్డి అల్లుడు' కోసం వెయిట్ చేస్తున్నాను: అనూ ఇమ్మాన్యుయేల్
Advertisement
ఈ మధ్య కాలంలో తెలుగు తెరకి పరిచయమై, యూత్ లో ఎక్కువ క్రేజ్ ను సంపాదించుకున్న కథానాయికగా అనూ ఇమ్మాన్యుయేల్ కనిపిస్తుంది. ఇటీవల ఆమె చేసిన సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడకపోయినా, యూత్ లోని క్రేజ్ కారణంగానే ఆమెకి 'శైలజా రెడ్డి అల్లుడు' సినిమాలో ఛాన్స్ దొరికింది. ఈ సినిమా ఈ నెల 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ .. "ఈ సినిమాలో నేను రమ్యకృష్ణ కూతురుగా కనిపిస్తాను. ఒక రేంజ్ లో 'ఈగో'ను చూపిస్తూ వుంటాను. ఇప్పటివరకూ నేను చేసిన పాత్రలకి ఈ పాత్ర పూర్తి భిన్నంగా ఉంటుంది. అందువలన ఈ పాత్ర నాకు మంచి పేరు తీసుకొస్తుందనే నమ్మకం వుంది. రమ్యకృష్ణ గారు గొప్ప నటి అని తెలుసు .. ఆమెతో కలిసి నటించడం అదృష్టంగా భావిస్తున్నాను. ఎంత పెద్ద డైలాగ్ అయినా ఆమె ఒక్కసారి చూసుకునే చెప్పేయడం చూసి ఆశ్చర్యపోయాను. ఈ సినిమా విడుదల తేదీ ఎంత తొందరగా వస్తుందా అని మీ అందరికంటే ఎక్కువగా ఎదురుచూస్తున్నాను" అని చెప్పుకొచ్చింది.  
Thu, Sep 06, 2018, 03:54 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View