బాబూమోహన్ కు షాకిచ్చిన కేసీఆర్
Advertisement
మెదక్ జిల్లా ఆందోల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, సినీ నటుడు బాబూ మోహన్ కు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ షాకిచ్చారు. ఆయనతో పాటు చెన్నూరు సిట్టింగ్ ఎమ్మెల్యే నల్లాల ఓదేలుకు కూడా టికెట్లు నిరాకరిస్తున్నట్టు ఆయన తెలిపారు. తెలంగాణ భవన్ లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ మేరకు ప్రకటించారు. ఆందోల్ టికెట్ ను జర్నలిస్ట్ క్రాంతికిరణ్ కి ఇస్తున్నట్టు తెలిపారు.

కాగా, పలు సందర్భాల్లో అధికారుల పట్ల, ప్రజల పట్ల బాబూమోహన్ అభ్యంతరకరంగా ప్రవర్తించిన సంగతి తెలిసిందే. ప్రగతి నివేదన సభ సందర్భంగా కూడా ఏకంగా టీఆర్ఎస్ కార్యకర్తలపైనే ఆయన కాలెత్తారు. బాబూమోహన్ కు కేసీఆర్ టికెట్ ఇవ్వకపోవడానికి ఇటువంటి సంఘటనలే కారణం కావచ్చని భావిస్తున్నారు. 
Thu, Sep 06, 2018, 03:30 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View