అద్భుతమైన టాలెంట్ చరణ్ సొంతం: వివేక్ ఒబెరాయ్
Advertisement
చరణ్ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ యూరేసియాలోని 'అజర్ బైజాన్' లో జరుగుతోంది. చరణ్ .. వివేక్ ఒబెరాయ్ తదితరులపై ఒక యాక్షన్ ఎపిసోడ్ ను అక్కడ చిత్రీకరిస్తున్నారు. ఈ యాక్షన్ ఎపిసోడ్ ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలవనుందని అంటున్నారు.

 తాజాగా ఈ ప్రాజెక్టు గురించి వివేక్ ఒబెరాయ్ స్పందించాడు. 'అజర్ బైజాన్' దేశం పౌరుషానికి ప్రతీక .. అలాంటి దేశంలో ఈ సినిమా షూటింగు జరుగుతూ ఉండటం ఆనందంగా వుంది. మాస్టర్ డైరెక్టర్ బోయపాటి టేకింగ్ ఎంతో గొప్పగా వుంది. అద్భుతమైన టాలెంట్ చరణ్ సొంతం .. ఆయనతో కలిసి నటించడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది. ఒక్కమాటలో చెప్పాలంటే సీట్ ఎడ్జ్ పై కూర్చుని ఎంజాయ్ చేయవలసిన సినిమా ఇది .. ఎదురుచూస్తూ వుండండి' అంటూ ట్వీట్ చేశాడు. లొకేషన్ లోని ఫోటోను ఆయన షేర్ చేయడంతో, ఈ సినిమాపై మరింతగా అంచనాలు పెరిగిపోతున్నాయి.      
Thu, Sep 06, 2018, 03:08 PM
Copyright © 2018; www.ap7am.com
Privacy Policy | Desktop View