అరుదైన రికార్డును సొంతం చేసుకున్న 'గీత గోవిందం'
Advertisement
విజయ్ దేవరకొండ .. రష్మిక మందన జంటగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'గీత గోవిందం' సంచలన విజయాన్ని సాధించింది. 'గీతా ఆర్ట్స్ 2' బ్యానర్లో రూపొందిన ఈ సినిమా, 12 రోజుల్లోనే 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. విడుదలైన ప్రతి ప్రాంతంలో ఈ సినిమా తన జోరును కొనసాగిస్తూ 25 రోజులను పూర్తి చేసుకుంది.

25 రోజులను పూర్తి చేసుకోవడం గొప్ప విషయమేమీ కాదు .. కానీ 402 థియేటర్లలో ఈ సినిమా 25 రోజులను పూర్తి చేసుకోవడమే చెప్పుకోదగిన విషయం. తెలుగు రాష్ట్రాల్లో 302 థియేటర్స్ లో ఈ సినిమా 25 రోజులను పూర్తి చేసుకోగా, మిగతా ప్రాంతాల్లోని థియేటర్స్ ను కలుపుకోగా ఆ సంఖ్య 402కి చేరుకుంది. ఇప్పటికీ ఈ సినిమా వసూళ్లపై కొత్త సినిమాల ప్రభావం అంతగా లేకపోవడంతో, 50 రోజుల మైలురాయిని కూడా ఈ సినిమా చాలా తేలికగా దాట గలదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.    
Thu, Sep 06, 2018, 02:16 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View