నాకు ఫ్లాప్స్ రావడానికి కారణమదే: హీరో నిఖిల్
Advertisement
తాజాగా టీవీ 9 'ఇంటరాగేషన్' కార్యక్రమం హీరో నిఖిల్ పై జరిగింది. ఈ కార్యక్రమంలో తనకి ఎదురైన ప్రశ్నలకి ఆయన సమాధానాలు చెబుతూ వచ్చాడు. తన కెరియర్ కి సంబంధించిన ఒక ప్రశ్నకి ఆయన స్పందిస్తూ .. 2007లో వచ్చిన 'హ్యాపీ డేస్' ద్వారా ఒక నటుడిగా నేను జనానికి తెలిశాను. సినిమా ఇండస్ట్రీలో నాకు ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేదు .. గాడ్ ఫాదర్స్ లేరు. కేవలం శేఖర్ కమ్ముల మంచితనం వలన .. ఆయన వ్యక్తిత్వం కారణంగా నాకు 'హ్యాపీ డేస్'లో ఛాన్స్ వచ్చింది.

చాలామందికి జరిగిన ఆడిషన్స్ లో నేను సెలెక్ట్ అయ్యాను. నా టాలెంట్ తోనే నేను సినిమాల్లోకి వచ్చాను. ఇది ఇలా చేయాలి .. అది అలా చేయాలి అని చెప్పడానికి నాకు ఎవరూ లేరు. నేను చేసిన పొరపాట్ల నుంచే నేను పాఠాలు నేర్చుకోవలసి వచ్చింది. అందువలన కెరియర్ మొదట్లో చాలా ఫ్లాప్స్ పడ్డాయి. నాకు అవగాహన వచ్చిన దగ్గర నుంచి మంచి సినిమాలు చేస్తూ వెళుతున్నాను" అని చెప్పుకొచ్చాడు.       
Thu, Sep 06, 2018, 01:21 PM
Copyright © 2018; www.ap7am.com
Privacy Policy | Desktop View