గ్రాండ్ గా ప్రభాస్ 20వ సినిమా ప్రారంభం
Advertisement
Advertisement
ప్రస్తుతం ప్రభాస్ 'సాహో' సినిమా చేస్తున్నాడు. సుజీత్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా ఇప్పటికే కొంతవరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే, తదుపరి సినిమాను ప్రభాస్ లైన్లో పెట్టాడు. గోపీకృష్ణ మూవీస్ బ్యానర్ పై కృష్ణంరాజుతో కలిసి యూవీ క్రియేషన్స్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. గతంలో గోపీకృష్ణ మూవీస్ బ్యానర్లో చాలా సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి .. వాటిలో కొన్ని ఘన విజయాలను అందుకున్నాయి. అలాంటి ఈ బ్యానర్లో .. రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ఆయన 20వ సినిమాను ఈ రోజున లాంచ్ చేశారు. హైదరాబాద్ లోని కృష్ణంరాజు ఆఫీసులో కొంతసేపటి క్రితం ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి. పలువురు సినిమా ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. పూజా హెగ్డే కథానాయికగా నటించనున్న ఈ సినిమా, ఈ నెల 20వ తేదీ నుంచి యూరప్ లో రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది.   
Thu, Sep 06, 2018, 12:57 PM
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View