మెగా హీరో గ్యాప్ తీసుకున్నది అందుకేనట!
Advertisement
మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన సాయిధరమ్ తేజ్, చాలా తక్కువ కాలంలోనే మాస్ హీరోగా మంచి మార్కులు కొట్టేశాడు. తనదైన స్టైల్లో ఆయన వరుస సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు గానీ, సక్సెస్ మాత్రం కరుణించడం లేదు. 'తేజ్ ఐ లవ్ యూ' పరాజయం తరువాత ఆయన కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఒక సినిమా చేయవలసి వుంది. కానీ ఆయన గ్యాప్ తీసుకున్నాడు.

ఇటీవల ఆయన జుట్టురాలే సమస్యతో సతమతమవుతున్నాడట. దానికి కొంచెం కాస్ట్ లీ ట్రీట్ మెంట్ తీసుకున్నాడని సమాచారం. అంతే కాకుండా కాస్త బరువు తగ్గితే మంచిదని సన్నిహితులు చెప్పడంతో, ఆ దిశగా కసరత్తులు కూడా చేస్తున్నాడని అంటున్నారు. అందువల్లనే ఆయన గ్యాప్ తీసుకున్నాడని చెబుతున్నారు. ఈ నెలాఖరులో ఆయన కిషోర్ తిరుమలతో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నాడు. ఆ తరువాత ప్రాజెక్టును పరశురామ్ తో చేయనున్నట్టుగా ప్రచారం జరుగుతోంది.    
Thu, Sep 06, 2018, 12:38 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View