నేనే కాదు ఏ యాక్టర్ అయినా ఇలాగే చేస్తారు: హీరో నిఖిల్
Advertisement
తాజాగా టీవీ9లో ప్రసారమైన 'ఇంటరాగేషన్' కార్యక్రమంలో హీరో నిఖిల్ పాల్గొన్నాడు. "మీరు షూటింగ్స్ కన్నా షాపుల ఓపెనింగ్స్ కి ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తారట .. అది ఎంతవరకూ నిజం? .. షాపుల ఓపెనింగ్స్ కి మీరు వెళ్లేది కేవలం డబ్బుకోసమేనా?" అనే ప్రశ్న ఆయనకి ఎదురైంది.

అప్పుడు నిఖిల్ స్పందిస్తూ .. 'నాకు షూటింగ్స్ ముఖ్యం .. అలా అని చెప్పేసి నేను షాప్స్ ఓపెనింగ్స్ ను వదులుకోను .. ఎందుకంటే నాకు అవసరమైన ఎక్స్ ట్రా మనీ దాని ద్వారానే వస్తుంది. అలా అని చెప్పేసి కేవలం డబ్బుకు మాత్రమే ప్రాధాన్యతను ఇవ్వను. ఛారిటీకి సంబంధించిన ఈవెంట్స్ ను నేను ఫ్రీగా చేస్తాను .. కమర్షియల్ ఈవెంట్స్ అయితే డబ్బు తీసుకునే చేస్తాను. నేనే కాదు .. ఏ యాక్టర్ అయినా .. స్పోర్ట్ పర్సన్ అయినా ఇలాగే చేస్తారు" అని చెప్పుకొచ్చాడు.  
Thu, Sep 06, 2018, 12:22 PM
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View