ఎన్టీఆర్ సినిమాతో పోటీకి దిగుతున్న వర్మ!
Advertisement
రామ్ గోపాల్ వర్మ సమర్పకుడిగా సిద్ధార్థ దర్శకత్వంలో 'భైరవగీత' చిత్రం రూపొందింది. నాయకా నాయికలుగా ధనుంజయ .. ఐరా ఈ సినిమా ద్వారా పరిచయమవుతున్నారు. సీమ నేపథ్యంలో సాగే ప్రేమకథ ఇది. అలాంటి ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 12వ తేదీన విడుదల చేయాలని వర్మ నిర్ణయించుకున్నాడు.

అయితే అంతకు ఒక రోజు ముందు .. అంటే అక్టోబర్ 11వ తేదీన 'అరవింద సమేత వీర రాఘవ' ప్రేక్షకుల ముందుకు రానుంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ .. పూజా హెగ్డే జంటగా నటిస్తోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు వున్నాయి. అలాంటి ఈ సినిమాతో పోటీ పడటం కష్టమని భావించి చాలా సినిమాలు వేరే తేదీలు వెతుక్కుంటున్నాయి. అలాంటి పరిస్థితుల్లో 'అరవింద సమేత'కి పోటీగా వర్మ 'భైరవగీత'ను నిలబెట్టడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. మరి ఈ పోటీని ఈ సినిమా ఎంతవరకూ తట్టుకుంటుందో చూడాలి.
Thu, Sep 06, 2018, 12:05 PM
Copyright © 2018; www.ap7am.com
Privacy Policy | Desktop View