నా తమ్ముడిని ర్యాగింగ్ చేయడం వల్లే అప్పుడు నేను జోక్యం చేసుకున్నాను: హీరో నిఖిల్
Advertisement
మొదటి నుంచి కూడా నిఖిల్ వైవిధ్యభరితమైన కథా చిత్రాలకి ప్రాధాన్యతనిస్తూ వస్తున్నాడు. ఆయన తాజా చిత్రంగా 'ముద్ర' ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా టీవీ 9 ఇంటరాగేషన్ కార్యక్రమంలో నిఖిల్ తనకి ఎదురైన ప్రశ్నలకి సమాధానాలిచ్చాడు.

"కాలేజ్ స్టూడెంట్ అయిన మీ తమ్ముడు రోహిత్ విషయంలో మీరు తలదూర్చారు .. కాలేజ్ కి కొంతమంది గ్యాంగ్ ను తీసుకెళ్లి కొంతమంది కుర్రాళ్లను చితగ్గొట్టిన మాట వాస్తవం కాదా?" అనే ప్రశ్న ఆయనకి ఎదురైంది. అందుకు నిఖిల్ స్పందిస్తూ .. 'మీ తమ్ముడిని గానీ .. చెల్లెలిని గాని ర్యాగింగ్ పేరుతో ఎవరైనా ఏడిపిస్తే మీరెలా రియాక్ట్ అవుతారో, నేను అలాగే రియాక్ట్ అయ్యాను. అయితే నేను ఎవరిపైనా చేయి చేసుకోలేదు .. చట్టాన్ని చేతిలోకి తీసుకోలేదు. పోలీసులకి ఫిర్యాదు చేశాను .. మా కంటే ముందుగానే వాళ్లు కాలేజ్ కి చేరుకుని, కారకులను అదుపులోకి తీసుకున్నారు' అని చెప్పుకొచ్చాడు. 
Thu, Sep 06, 2018, 11:17 AM
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View