మహేశ్ 26వ మూవీ బడ్జెట్ 150 కోట్లు?
Advertisement
ప్రస్తుతం మహేశ్ బాబు 'మహర్షి' సినిమా పనులతో బిజీగా వున్నాడు. ఇది ఆయనకి 25వ సినిమా కావడంతో, దర్శకుడు వంశీ పైడిపల్లి మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణ జరుపుకుంది. ఏప్రిల్ 5వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే మహేశ్ 26వ మూవీకి సంబంధించిన సన్నాహాలు జరిగిపోతున్నాయి.

 ఈ సినిమాకి దర్శకుడు సుకుమార్ అనే సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈ సినిమాకి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. 150 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను రూపొందించనున్నారట. పెద్ద సంఖ్యలో హాలీవుడ్ టెక్నీషియన్స్ పని చేయనున్న కారణంగా ఇంత భారీ బడ్జెట్ ను కేటాయించినట్టు సమాచారం. గతంలో సుకుమార్ .. మహేశ్ బాబు కాంబినేషన్లో వచ్చిన '1 నేనొక్కడినే' చిత్రం పరాజయాన్ని చవిచూసింది. అందువలన ఈ సారి తప్పకుండా మహేశ్ కి హిట్ ఇవ్వాలనే పట్టుదలతో సుకుమార్ వున్నాడని చెబుతున్నారు. 
Thu, Sep 06, 2018, 10:39 AM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View