భారత్ కు పెను ముప్పు.. భారీగా అణ్వాయుధాలను పెంచుకుంటున్న పాకిస్థాన్!
Advertisement
ఇది నిజంగా భారత్ కు కలవరం కలిగించే విషయమే. మన శత్రు దేశం పాకిస్థాన్ భారీ ఎత్తున అణ్వాయుధ సంపదను పెంచుకుంటోంది. ఇప్పటికే పాక్ వద్ద 140 నుంచి 150 వరకు న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయి. ఈ సంఖ్యను మరింత పెంచుకునే దిశగా పాక్ వడివడిగా అడుగులు వేస్తోంది. మరో ఏడేళ్లలో అంటే 2025 నాటికి వార్ హెడ్స్ ను 220 నుంచి 250 వరకు పెంచుకునేందుకు పాక్ యత్నిస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా అమెరికా వెల్లడించింది.

ఇదే వేగంతో పాకిస్థాన్ ముందుకు వెళ్తే... ప్రపంచంలోనే అత్యధికంగా వార్ హెడ్స్ ఉన్న ఐదవ దేశంగా నిలుస్తుందని అమెరికన్ డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఓ నివేదికలో పేర్కొంది. 2020కి పాక్ మరో 80 న్యూక్లియర్ వార్ హెడ్స్ ను సమకూర్చుకుంటుందని, 2025 నాటికి తన టార్గెట్ ను చేరుకుంటుందని తెలిపింది. 
Thu, Sep 06, 2018, 09:34 AM
Copyright © 2018; www.ap7am.com
Privacy Policy | Desktop View