'మా' రచ్చ.. చిరంజీవి ఆగ్రహం.. ఈవెంట్ క్యాన్సిల్ చేసుకున్న మహేష్ బాబు!
Advertisement
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా)కు ఈ ఏడాది ఏ మాత్రం అచ్చొచ్చినట్టు లేదు. డ్రగ్స్, క్యాస్టింగ్ కౌచ్ ఉదంతాలు 'మా' పరువును బజారుకు లాగగా... తాజాగా నిధుల దుర్వినియోగం గొడవ 'మా'ను సిగ్గుతో తలొంచుకునేలా చేసింది. అసోసియేషన్ అధ్యక్షుడు శివాజీరాజా నిధులను దుర్వినియోగం చేశారంటూ ఓ ఆంగ్ల పత్రికలో కథనం ప్రచురితమవడంతో వివాదం తలెత్తింది. సంఘం కార్యదర్శి నరేష్ ఆ కథనానికి మద్దతు పలికారు. దీంతో, అసోసియేషన్ రెండుగా చీలిపోయి ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నాయి.

ఈ వివాదంలో తన పేరు ప్రస్తావనకు రావడంతో మెగాస్టార్ చిరంజీవి ఆగ్రహం వ్యక్తం చేశారని సమాచారం. మరోవైపు అక్టోబర్ లో సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఓ ఈవెంట్ ను 'మా' సభ్యులు ఫిక్స్ చేశారు. అయితే, వివాదం నేపథ్యంలో ఈవెంట్ ను మహేష్ బాబు క్యాన్సిల్ చేసుకున్నట్టు ఫిలింనగర్ టాక్. ఇలాంటి సమయంలో తాను ఈ షోలో పాల్గొనడం మంచిది కాదనే భావనలో మహేష్ ఉన్నాడట. యూఎస్ లో ఎంతో ఫాలోయింగ్ ఉన్న మహేష్ ఈవెంట్ ను క్యాన్సిల్ చేసుకోవడం... 'మా'కు పెద్ద షాకే. 
Thu, Sep 06, 2018, 09:23 AM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View