టీమిండియా సారథి కోహ్లీ-రోహిత్ శర్మ మధ్య విభేదాలు?
Advertisement
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ-స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ మధ్య విభేదాలు తలెత్తాయన్న వార్త ఇప్పుడు క్రికెట్ అభిమానుల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. సోషల్ మీడియాలో ఇప్పుడు దీనిపైనే పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. దీనికి కారణం కూడా బలంగానే ఉండడంతో చర్చకు తెరపడడం లేదు.

అసలింతకీ ఏం జరిగిందన్న దానిపై ఎవరిలోనూ స్పష్టత లేకున్నా కోహ్లీ-రోహిత్ మధ్య విభేదాలు మాత్రం పక్కా అని చెబుతున్నారు. టెస్టు జట్టులో తనకు చోటివ్వకపోవడంతో కోహ్లీపై అలిగిన రోహిత్ సోషల్ మీడియాలో కోహ్లీని అన్‌ఫాలో చేశాడన్న వార్త గుప్పుమంది. ఇద్దరి మధ్య ఏం జరిగిందో చెప్పాలంటూ ఇద్దరినీ ట్యాగ్ చేస్తూ ప్రశ్నలు కురిపిస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ విషయంపై రచ్చ రచ్చ జరుగుతున్నా ముంబైలో ఉన్న రోహిత్ కానీ, ఇంగ్లండ్‌లో ఉన్న కోహ్లీ కానీ ఇప్పటి వరకు స్పందించలేదు.
Thu, Sep 06, 2018, 08:27 AM
Copyright © 2018; www.ap7am.com
Privacy Policy | Desktop View