సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
Advertisement
*  'సన్నాఫ్ సత్యమూర్తి' చిత్రం తర్వాత అల్లు అర్జున్, సమంత కలసి మరోసారి జంటగా నటించనున్నారు. విక్రంకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించే చిత్రంలో కథానాయిక పాత్రకు సమంతను తీసుకుంటున్నట్టు సమాచారం.
*  యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ నటిస్తున్న తాజా చిత్రానికి 'మిస్టర్ పోలీస్' అనే టైటిల్ని నిర్ణయించారు. నూతన దర్శకుడు శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో కాజల్, మెహ్రీన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
*  ఇరవై ఏళ్ల క్రితం రజనీకాంత్, మీనా జంటగా నటించిన 'ముత్తు' చిత్రం తెలుగు, తమిళ భాషల్లోనే కాకుండా జపాన్ లో కూడా బాగా ఆడింది. రజనీకాంత్ కు అప్పట్లో జపాన్ లో అభిమాన గణాన్ని కూడా సంపాదించిపెట్టింది. రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ ఈ చిత్రాన్ని జపాన్ లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. వచ్చే నవంబర్ 23 న జపనీస్ డబ్బింగ్ వెర్షన్ అక్కడ రిలీజవుతుంది.
*  ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ నిర్మిస్తున్న 'భైరవ గీత' చిత్రాన్ని వచ్చే నెల 12న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. వర్మ అసిస్టెంట్ సిద్ధార్థ్ దర్శకత్వంలో  రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో ప్రేమకథా చిత్రంగా ఇది రూపొందుతోంది.
Thu, Sep 06, 2018, 07:26 AM
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View