ఆటోడ్రైవర్ భార్యకు కలిసొచ్చిన అదృష్టం.. శివమొగ్గ మేయర్‌గా ఎన్నిక!
Advertisement
మనం ఎంత కష్టపడినా, కాస్తంత అదృష్టం కూడా కలిసి వస్తేనే ఏదైనా సాధించవచ్చని పెద్దలంటారు. అది నిజమేనని ఈ సంఘటన రుజువు చేస్తోంది. కర్ణాటకలోని శివమొగ్గకు చెందిన బీజేపీ కార్యకర్త గణేశ్ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇటీవల జరిగిన నగర మునిసిపాలిటీ ఎన్నికల్లో గణేశ్ ఉండే ప్రాంతం మహిళలకు రిజర్వు అయింది. దీంతో తన భార్య లతను ఎన్నికల బరిలోకి దించాడు. ఎన్నికల ఖర్చును పార్టీ ముఖ్య నేతలే భరించడంతో ఆర్థిక భారం గణేశ్‌పై పడలేదు. ఈ ఎన్నికల్లో లత కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. 20 స్థానాలు సాధించిన బీజేపీ శివమొగ్గలో తిరుగులేని మెజారిటీ సాధించింది.

సరిగ్గా, ఇక్కడే లతకు అదృష్టం తోడైంది. శివమొగ్గ మేయర్ స్థానం ఎస్సీ మహిళకు రిజర్వు కావడం, పార్టీలో లత తప్ప మరెవరూ ఎస్సీ మహిళ లేకపోవడంతో మేయర్ పదవికి ఆమె అర్హురాలైంది. అందరూ కలిసి ఆమెను మేయర్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తన భార్య లత మేయర్‌గా ఎన్నిక కావడంపై గణేశ్ ఆనందం వ్యక్తం చేశారు. పార్టీ కోసం రెండు దశాబ్దాలుగా పనిచేస్తున్న తమ కుటుంబానికి దక్కిన గౌరవం ఇదని పేర్కొన్నాడు.
Thu, Sep 06, 2018, 06:53 AM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View