దర్శకుడు రాజమౌళి కొడుకు కార్తికేయకు వివాహ నిశ్చితార్థం!
Advertisement
ప్రముఖ దర్శకుడు రాజమౌళి కొడుకు కార్తికేయ, ‘జగపతి’ రాజేంద్రప్రసాద్ మనవరాలు పూజా ప్రసాద్ నిశ్చితార్థం ఈరోజు జరిగింది. రాజమౌళి నివాసంలో నిశ్చితార్థ కార్యక్రమం జరిగినట్టు సమాచారం. ఈ ఏడాది చివరిలో వారి వివాహం జరగనున్నట్టు తెలుస్తోంది. కాగా, ‘జగపతి’ రాజేంద్రప్రసాద్ పెద్ద కుమారుడు రాంప్రసాద్ కుమార్తె పూజా ప్రసాద్. భక్తిగీతాలు ఆలపించే పూజా ప్రసాద్ గాయనిగా గుర్తింపు తెచ్చుకున్నారు. కార్తికేయ, పూజాప్రసాద్ ల పెళ్లి పెద్దల అంగీకారంతో జరగనున్న ప్రేమ వివాహం అని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. ప్రముఖ నటుడు జగపతిబాబుకు రాంప్రసాద్ అన్న అవుతారు.
Wed, Sep 05, 2018, 10:00 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View